భోగాపురం రైతన్నలకి ప్రత్యేక గుర్తింపు..
ఎయిర్పోర్టుకు భూములిచ్చిన 403 మంది రైతులకు ప్రశంసా పత్రాలు... మరో 1,600 మంది రైతులకు త్వరలో అందజేత.. VVIP గ్యాలరీలో వారి పేర్లతో శాశ్వత గుర్తింపు...
ఆంధ్రప్రదేశ్, ఆగస్టు 1 (వి10 టీవీ):
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతుల సేవలను ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తిస్తోంది. తొలి విడతగా 403 మంది రైతులకు ప్రశంసా పత్రాలు అందజేయగా, మరో 1,600 మంది రైతులకు కూడా త్వరలో ప్రశంసా పత్రాలు అందించనున్నట్లు అధికారులు తెలిపారు.
అదేవిధంగా విమానాశ్రయంలోని VVIP గ్యాలరీలో భూములిచ్చిన రైతుల పేర్లను శాశ్వతంగా పొందుపరచాలని నిర్ణయించారు. గూడెపువలస, రావాడ, కంచేరు, కవులవాడ గ్రామాలకు చెందిన రైతుల పేర్లు ఇందులో నమోదు చేయనున్నారు.
ఈ ప్రతిపాదనకు సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేసి హైదరాబాద్కు చెందిన డిజైన్ సంస్థ ద్వారా రూపొందించిన నమూనాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అధికారులు వివరించినట్లు సమాచారం. సీఎం ఈ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

