వీ10టీవీనిజం మీ ముందుకు
వీ10టీవీ
నిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

మమ్మల్ని అనుసరించండి

వార్తలు వెతకండి అడ్మిన్ లాగిన్

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/రోజువారీ వార్తలు/వార్త

ఆదర్శం నుంచి ఆవేదన వరకు

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి జీవితం యువతకు గుణపాఠం..

V10TV న్యూస్ డెస్క్30 జులై, 2026 4:03 AM 65,228
ఆదర్శం నుంచి ఆవేదన వరకు — చిత్రం 11 / 1
WhatsApp FacebookX Telegram
జులై 30,(వి10 టివి): కొన్ని జీవితాలు సముద్ర అలల్లా ఒక్కసారిగా ఎగసిపడతాయిట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి జీవితం యువతకు గుణపాఠం... వాటిని చూసి ఎంతోమంది స్ఫూర్తి పొందుతారు. కానీ అదే జీవితాలు ఒక్క తప్పు నిర్ణయం వల్ల పాతాళానికి పడిపోతే... అది సమాజానికి, యువతకు ఒక గట్టి హెచ్చరికగా మిగిలిపోతుంది. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి జీవితం అలాంటి విషాద గాథగానే నిలిచింది. అత్యంత నిరుపేద కుటుంబంలో జన్మించిన ఉదయ్ కృష్ణారెడ్డి చిన్న వయసులోనే తల్లిని కోల్పోయాడు. తండ్రి కూడా దూరమవడంతో అమ్మమ్మ కూలి పనులు చేస్తూ అతన్ని పెంచి పెద్ద చేసింది. పేదరికం అతని చదువుకు అడ్డంకిగా నిలిచినా, ఇంటర్మీడియట్ నుంచే చిన్న చిన్న పనులు చేస్తూ తన విద్యాభ్యాసాన్ని కొనసాగించాడు. కష్టపడి డిగ్రీ పూర్తి చేసి కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సంపాదించాడు. అయితే అతని కల అక్కడితో ఆగలేదు. భారత పోలీసు సేవలో అధికారి కావాలనే లక్ష్యంతో ఉద్యోగాన్నే వదిలి సివిల్స్ కోసం సిద్ధమయ్యాడు. ఎన్నో కష్టాలు, అవమానాలు, ఆర్థిక ఇబ్బందులను అధిగమించి చివరకు ఐపీఎస్‌గా ఎంపికై వేలాది మంది యువతకు ఆదర్శంగా నిలిచాడు. "కష్టపడితే ఏదైనా సాధ్యమే" అనే మాటకు ఉదాహరణగా అతని జీవితాన్ని చెప్పుకునేవారు. కానీ జీవితంలో శిఖరానికి చేరిన తర్వాత తీసుకున్న ఒక తప్పు అడుగు అతని భవిష్యత్తును పూర్తిగా మార్చేసింది. శిక్షణలో ఉన్న సమయంలో మద్యం మత్తులో తనతో పాటు శిక్షణ పొందుతున్న మహిళా ఐపీఎస్ ట్రైనీపై వేధింపులు, అత్యాచారయత్నం సహా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్టు చేయగా, కోర్టు రిమాండ్ విధించింది. ప్రస్తుతం అతను జైలులో ఉన్నాడు. ఒకప్పుడు విజయగాథగా చెప్పుకున్న పేరు... ఇప్పుడు హెచ్చరికగా మారింది. పేదరికాన్ని జయించిన వ్యక్తి చివరకు తన ప్రవర్తనను మాత్రం జయించలేకపోయాడు. విద్య, ప్రతిభ, పదవి, విజయం అన్నీ ఉన్నా... సంస్కారం, ఆత్మనిగ్రహం, మహిళల పట్ల గౌరవం లేకపోతే ఒక్క క్షణంలోనే జీవితం కూలిపోతుందనే విషయాన్ని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది. ఉదయ్ కృష్ణారెడ్డి కథ ఇక విజయగాథ కాదు. కష్టపడి సాధించిన జీవితాన్ని ఒక తప్పు నిర్ణయం ఎలా నాశనం చేస్తుందో చెప్పే గుణపాఠం. శిఖరానికి చేరడం ఎంత గొప్పదో... అక్కడ నిలబడటం అంతకంటే గొప్పదని యువత గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.
WhatsApp FacebookX Telegram

తాజా వార్తలు

సేవే సమాజానికి నిజమైన సంపద: డాక్టర్ జీవన్ కుమార్

నిన్న 1,677

గోమాతకు రాష్ట్ర మాత హోదా కల్పించాలంటూ నేడు విజయవాడలో మహా సంకీర్తన ర్యాలీ

4 రోజుల క్రితం 1

చిన్నారి చంద్రిక చికిత్సకు ప్రభుత్వం అండ.. బసవతారకం ఆస్పత్రిలో మంత్రి సత్యకుమార్ పరామర్శ

4 రోజుల క్రితం 3

రేపటి నుంచి ఇంద్రకీలాద్రిపై శాకంబరీ మహోత్సవాలు.. కాయగూరలతో కనకదుర్గమ్మకు మహా అలంకారం

4 రోజుల క్రితం 0