వీ10టీవీనిజం మీ ముందుకు
వీ10టీవీ
నిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

మమ్మల్ని అనుసరించండి

వార్తలు వెతకండి అడ్మిన్ లాగిన్

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/రోజువారీ వార్తలు/వార్త

బంగారం ఆశతో వృద్ధురాలి ప్రాణం తీశారు

ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలిని హత్య చేసి బంగారు నగలు అపహరణ.. ప్రధాన నిందితుడిపై గతంలో మూడు ఆస్తి సంబంధిత కేసులు నమోదు.. అరవై మూడు గ్రాముల బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్ స్వాధీనం..

V10TV న్యూస్ డెస్క్17 జులై, 2026 3:51 PM 7
బంగారం ఆశతో వృద్ధురాలి ప్రాణం తీశారు
WhatsApp FacebookX Telegram
విజయవాడ, జూలై 17(వి10టివి): విజయవాడలో ఒంటరిగా నివసిస్తున్న వృద్ధ మహిళను హత్య చేసి బంగారు ఆభరణాలు అపహరించిన కేసును వన్‌టౌన్ పోలీసులు గంటల్లోనే ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేయడంతో పాటు ఓ బాల నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి అరవై మూడు గ్రాముల బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్, నేరానికి ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.దర్యాప్తులో ప్రధాన నిందితుడు మృతురాలికి దూరపు బంధువేనని, అతడిపై గతంలో మూడు ఆస్తి సంబంధిత కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. క్లూస్ బృందం, నిఘా దృశ్యాలు, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను గుంటూరు జిల్లా నులకపేటలో పట్టుకున్నారు.ఈ కేసును వేగంగా ఛేదించిన పోలీసు బృందాన్ని నగర పోలీసు కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు నగదు బహుమతితో అభినందించారు.
WhatsApp FacebookX Telegram

తాజా వార్తలు

ప్రైవేట్ ట్రావెల్స్‌పై అర్ధరాత్రి పోలీసుల మెరుపు తనిఖీలు

6 గంటల క్రితం 2

అంబులెన్స్ డ్రైవర్లకు ఏసీపీ కౌన్సెలింగ్

6 గంటల క్రితం 3

బీచ్‌లో ఆత్మహత్యాయత్నం.. యువకుడికి ప్రాణం పోసిన పోలీసులు

నిన్న 33

17న విజయవాడ తూర్పులో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక

మొన్న 5