వీ10టీవీనిజం మీ ముందుకు
వీ10టీవీ
నిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

మమ్మల్ని అనుసరించండి

వార్తలు వెతకండి అడ్మిన్ లాగిన్

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/రోజువారీ వార్తలు/వార్త

బీచ్‌లో ఆత్మహత్యాయత్నం.. యువకుడికి ప్రాణం పోసిన పోలీసులు

విశాఖ బీచ్‌లో అప్రమత్తంగా స్పందించి యువకుడిని కాపాడిన పోలీసులు.. ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగంతో తీవ్ర మనోవేదనకు గురైన బాధితుడు.. కౌన్సెలింగ్‌తో పాటు ఆర్థిక సాయం అందించిన సీఐ వరప్రసాద్..

విశాఖపట్నంV10TV న్యూస్ డెస్క్17 జులై, 2026 7:32 AM 33
బీచ్‌లో ఆత్మహత్యాయత్నం.. యువకుడికి ప్రాణం పోసిన పోలీసులు
WhatsApp FacebookX Telegram
విశాఖపట్నం, జులై 17(వి 10టివి): విశాఖ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీచ్‌లో ఆత్మహత్యకు యత్నించిన ఓ యువకుడిని పోలీసులు సకాలంలో స్పందించి రక్షించారు. బీచ్ ప్రాంతంలో అనుమానాస్పదంగా ఉన్న యువకుడిని గమనించిన పోలీసులు వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్నారు.అనంతరం యువకుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్ నిర్వహించారు. విచారణలో ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగం కారణంగా తీవ్ర మనోవేదనకు గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు అతడు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.ఈ సందర్భంగా సీఐ వరప్రసాద్ బాధితుడికి ధైర్యం చెప్పి, జీవితంపై ఆశ కోల్పోవద్దని సూచించారు. వ్యక్తిగతంగా కొంత ఆర్థిక సహాయం కూడా అందజేసి, అనంతరం అతడిని అతని స్నేహితుడి సంరక్షణలో సురక్షితంగా పంపించారు. సమయానికి స్పందించిన పోలీసుల చర్యను స్థానికులు అభినందించారు.
WhatsApp FacebookX Telegram

తాజా వార్తలు

ప్రైవేట్ ట్రావెల్స్‌పై అర్ధరాత్రి పోలీసుల మెరుపు తనిఖీలు

6 గంటల క్రితం 2

అంబులెన్స్ డ్రైవర్లకు ఏసీపీ కౌన్సెలింగ్

6 గంటల క్రితం 3

బంగారం ఆశతో వృద్ధురాలి ప్రాణం తీశారు

21 గంటల క్రితం 7

17న విజయవాడ తూర్పులో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక

మొన్న 5