ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.. భవానిపురంలో ప్రజా దర్బార్ నిర్వహించిన బీజేపీ
ప్రజల నుంచి పింఛన్లు, ఇళ్ల స్థలాలు, వైద్య సహాయం తదితర అంశాలపై వినతుల స్వీకరణ... ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరిస్తామని అడ్డూరి శ్రీరామ్..సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రజాదర్బార్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు...
చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, జూలై 23 (వి10టివి):
ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించడమే లక్ష్యంగా భవానిపురంలోని ఎన్డీయే కార్యాలయంలో గురువారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, కూటమి నాయకులతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
ఈ సందర్భంగా పింఛన్లు, ఇళ్ల స్థలాలు, వైద్య సహాయం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, స్థానిక సమస్యలు తదితర అంశాలకు సంబంధించిన అర్జీలను ప్రజలు అందజేశారు. ప్రతి వినతిని సంబంధిత శాఖల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని నాయకులు హామీ ఇచ్చారు.
అనంతరం అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ, ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం చూపడమే ప్రజా దర్బార్ ముఖ్య ఉద్దేశమన్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు ప్రతి వినతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేలా ఎమ్మెల్యే కార్యాలయం చర్యలు చేపడుతోందన్నారు. ప్రభుత్వ సేవలు ప్రతి అర్హుడికి చేరేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

సోమవారం నుంచి శుక్రవారం వరకు భవానిపురంలోని ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను తెలియజేయాలని అడ్డూరి శ్రీరామ్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు బుదాల నందకుమారి, పల్లెపోగు ప్రసాద్, పగడాల కృష్ణ, దాడి మురళీకృష్ణ, దనాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.

