పేదల వైద్యానికి పెద్దపీట.. ఎల్ఓసీలతో ఆర్థిక భరోసా
ముగ్గురు బాధితులకు రూ.10.08 లక్షల విలువైన ఎల్ఓసీలు అందజేత మెరుగైన వైద్య సేవల కోసం ప్రభుత్వ సహాయం అందించిన ఎమ్మెల్యే కార్యాలయం భవానిపురం ఎన్డీయే కార్యాలయంలో లబ్ధిదారులకు పత్రాల పంపిణీ
చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, జూలై 23 (వి10టివి): ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలో లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్ఓసీ) పత్రాలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, కూటమి నేతలతో కలిసి భవానిపురంలోని ఎన్డీయే కార్యాలయంలో బాధితులకు ఎల్ఓసీ పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా 43వ డివిజన్ ఊర్మిళ నగర్‌కు చెందిన షేక్ నసీర్ థైరాయిడ్ చికిత్స కోసం మంజూరైన రూ.2.77 లక్షల విలువైన ఎల్ఓసీని అందజేశారు. అలాగే

44వ డివిజన్ సితార సెంటర్‌కు చెందిన రాచకొండ గోపికి హెర్నియా చికిత్స కోసం రూ.1.80 లక్షల ఎల్ఓసీ అందించారు.
అదేవిధంగా 41వ డివిజన్ రంగూన్ సాహెబ్ వీధికి చెందిన బీ. గణేష్ చేయికి తీవ్ర గాయం కావడంతో మెరుగైన వైద్యం కోసం మంజూరైన రూ.5.51 లక్షల విలువైన ఎల్ఓసీని అందజేశారు. మొత్తం రూ.10.08 లక్షల విలువైన వైద్య సహాయాన్ని లబ్ధిదారులకు అందించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కూటమి నేతలు మోరబోయిన రాంబాబు, నందే విజయలక్ష్మి, కరిముల్లా, జయ బాలన్, పెదప్రోలు బాలసుబ్రమణ్యం, సుజనా మిత్రా కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.

